Thursday, March 28, 2024

RTC బస్సులో వెంకటేష్ కుటుంబం.. ప్రయాణంపై ఎండీ సజ్జనార్ ట్వీట్

తెలంగాణ ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపేందుకు ఎండీ సజ్జనార్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రజల్ని ఆర్టీసీ వైపు ఆకర్షించేందుకు ఇప్పటికే పలు రకాల చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీకి ఆదాయం పెంచే సంక్రాంతి పండుగ సమయంలోనూ ప్రయాణికులపై అదనపు ఛార్జిల భారం వేయకుండా వారిని గమ్య స్థానాలకు చేర్చారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లారు. దీంతో పాటు సంస్థను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు పలు వీడియోలను షేర్ చేస్తున్నారు.

తాజాగా హీరో విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాలోని ఓ వీడియోను సజ్జనార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. హీరో వెంకటేష్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీన్ కు సంబంధించిన వీడియో క్లిప్ ను సజ్జనార్ షేర్ చేశారు. ‘‘కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే మీ ప్రయాణం ఇలా ఆనందంగా ఉంటుంది.’’ అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement