Thursday, April 25, 2024

TSRTC: డ్రైవర్ విన్నూత ప్రయత్నం.. పాటతో ఆహ్వనం

టీఎస్ ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎండీ సజ్జనార్ ఆర్టీసీపై ప్రజల్లో నమ్మకం పెరిగే వివిధ రకాల చర్యలు తీసుకున్నారు. నిత్యం ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా సంస్థ సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నారు. ఆర్టీసీని తక్కువ చేసే వారిపై న్యాయ పరంగానూ పోరాటం చేస్తున్నారు. అంతే కాదు ఆర్టీసీని లాభాలబాటలో తీసుకొచేందుకు వివిధ రకాల ఆఫర్లను కూడా ప్రకటించారు.

ఇక, ఆర్టీసీ సిబ్బంది సైతం ప్రయాణికులను ఆకర్షించేందుకు వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. తాజాగా నాగర్‌కర్నూల్‌ బస్‌ స్టాండ్‌లో బస్సు డ్రైవర్‌ శాంతయ్య పాట కట్టి ప్రయాణికులను అలరిస్తున్నారు. బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులను పెదకొత్తపల్లి మండలంలోని బంగారు మైసమ్మ గుడికి వెళ్లి వద్దాం అంటూ తన పాట పాడుతున్నారు. శాంతయ్య మైక్‌ పట్టుకుని ‘బాధలు తీర్చే బంగారు మైసమ్మ దగ్గరకు.. భద్రంగా బస్సులో పోయి వద్దాం.. అక్కారండి, చెల్లే రండి.. అమ్మలగన్న అమ్మ బంగారు మైసమ్మ దగ్గరికి అమ్మలాంటి ఆర్టీసీ బస్సులో పోయివద్దాం’ అంటూ ప్రయాణికులు ఆర్టీసీ బస్సు ఎక్కేలా ప్రోత్సహిస్తున్నారు. డ్రైవర్ శాంతయ్య ప్రయత్నాన్ని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అభినందించారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియోనూ సోషల్ మీడియలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement