Thursday, January 20, 2022

పేలిన బ‌స్సు టైర్ – డ్రైవ‌ర్ మృతి

బ‌స్సు టైర్ పేల‌డంతో ఆర్టీసీ బ‌స్సు మురుగు కాలువ‌లోకి దూసుకుపోయింది. ఈ ఘ‌ట‌న‌లో బ‌స్ డ్రైవ‌ర్ దుర్మ‌ర‌ణం చెందాడు. కాగా సంఘ‌ట‌న తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కాగా 44మంది ప్ర‌యాణికులు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. జ‌గిత్యాల నుండి నిర్మ‌ల్ వెళ్తోన్న బ‌స్సు మ‌ల్కాపూర్ చేరుకోగానే ముందు టైరు పేలింది. ఈ క్రమంలో బస్సును నియంత్రించేందుకు విశ్వప్రయత్నం చేసిన డ్రైవర్ మురుగు కాలువలోకి పడిపోయాడు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. మరోవైపు తమ ప్రాణాలను కాపాడి ఆయన ప్రాణాలు విడిచారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News