Friday, April 19, 2024

తెలంగాణలో ‘ఆర్టీసీ’ బ‌స్సు ఛార్జీలు పెంపు..ఏ బ‌స్సుకి ఎంతెంత‌..!

తెలంగాణ ఆర్టీసీ బ‌స్సు ఛార్జీల పెంపుపై స‌మావేశం జ‌రిగింది. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటర్ కు 25 పైసలు, ఎక్స్‌ ప్రెస్‌ లు ఆపై సర్వీసులకు 30 పైసలు పెంచాలని రవాణా శాఖ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అలాగే…. సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 పైసలు పెంచాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తరువాత ఆర్టీసీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించనుంది . ఈ సమావేశంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆఫీస్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే… ఈ సమావేశంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఖైరతాబాద్ రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఈ స‌మావేశం జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement