Saturday, April 20, 2024

Written Test: ఎస్సై రాత పరీక్షకు ముందే లంచాల బాగోతం.. సీబీఐ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు!

సబ్​ ఇన్​స్పెక్టర్ల రాత పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఇవ్వాల (మంగళవారం) సీబీఐ పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఫోర్స్ లో సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్ట్ కోసం అభ్యర్థులు రూ. 20 లక్షల నుండి రూ. 30 లక్షల వరకు లంచంగా చెల్లించారన్న దానిపై కేసు నమోదు అయ్యింది. దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తోంది. అయితే.. అభ్యర్థులు మొత్తం అమౌంట్​ చెల్లించిన తర్వాత పరీక్షలకు ముందే వారికి ప్రశ్నపత్రాలను అందజేసినట్లు అధికారుల పరిశీలనలో తెలిసింది.

మంగళవారం ఈ కేసులో నిందితుల ఇళ్లల్లో సీబీఐ బృందం సోదాలు నిర్వహించింది.. హర్యానాలో కొంతమంది వ్యక్తులు, జమ్ము, కాశ్మీర్​లో కొంతమంది ఉపాధ్యాయులు, CRPFలో పనిచేసిన వారు, రిటైర్డ్ సిబ్బందితో పాటు  ఇంకొంతమంది అధికారులు ఈ రాకెట్‌ను నడుపుతున్నట్లు కనుగొన్నారు.  కాగా, నాలుగు రాష్ట్రాల్లోని 36 ప్రాంతాల్లో సీబీఐ ఇవ్వాల సోదాలు నిర్వహించిందని అధికారులు తెలిపారు.

జమ్మూ, శ్రీనగర్, కర్నాల్, మహేందర్‌గఢ్, రేవారీ, గాంధీధామ్, ఢిల్లీ, ఘజియాబాద్, బెంగళూరులోని అనుమానితుల ఇండ్లు, ఆఫీసులు, జమ్ము కాశ్మీర్​ సర్వీస్​ సెలక్షన్​ బోర్డు (JKSSB) మాజీ ఛైర్మన్ ఖలీద్ జహంగీర్, అప్పటి పరీక్షల నియంత్రణాధికారి అశోక్ కుమార్‌ల ఇళ్లల్లో ఈ సోదాలు జరిగాయి. సోదాల్లో ఇప్పటివరకు నేరారోపణ పత్రాలు, డిజిటల్ ఆధారాలు లభించాయని సీబీఐ అధికారులు తెలిపారు. J&K పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ల పోస్టుల కోసం రాత పరీక్షలో అవకతవకల ఆరోపణలపై 33 మంది నిందితులపై ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఆగస్టు 3న కేసు నమోదు అయ్యింది.

అయితే.. జమ్మూ, రాజౌరి, సాంబా జిల్లాల నుండి పరీక్షలు రాసి సబ్​ ఇన్​స్పెక్టర్లుగా ఎంపికైన అభ్యర్థుల్లో అధిక శాతం ఈ జిల్లాల నుంచే ఉన్నారని విచారణ కమిటీ కనుగొంది. బెంగళూరుకు చెందిన ప్రైవేట్ కంపెనీకి ప్రశ్నపత్రాన్ని తయారు చేసే పనిని అప్పగించడంలో జమ్ము కాశ్మీర్​ సర్వీస్​ సెలక్షన్​ బోర్డు (JKSSB) నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయని సీబీఐ తెలిపింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement