Thursday, April 25, 2024

ఏపీలో నేటి నుంచి వృద్ధుల‌కు రూ.’2500’పెన్ష‌న్ – సంతోషంగా ఉంద‌న్న ‘సీఎం జ‌గ‌న్’

ఏపీలో నేటి నుంచి వృద్ధుల‌కు రూ.2500పెన్ష‌న్ ఇవ్వ‌నున్నారు. ఈ నెల నుండి రూ.250పెంచింది ఏపీ ప్ర‌భుత్వం. మేనిఫెస్టోలో చెప్పిన ప్ర‌తి మాట‌ల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. దేశంలోనే అత్య‌ధిక పెన్ష‌న్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ అని అన్నారు. ప్ర‌త్తిపాడు గుంటూరు జిల్లాలో జ‌గ‌న్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ .. 62ల‌క్ష‌ల కుటుంబాల్లో మ‌రిన్ని చిరునవ్వులు రాబోతున్నాయ‌ని జ‌గ‌న్ తెలిపారు. మంచి కార్య‌క్ర‌మం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌న్నారు. పేద‌ల‌కు మంచి చేస్తుంటే విమ‌ర్శిస్తున్నార‌ని జ‌గ‌న్ చెప్పారు. వృద్ధుల‌కు మంచి చేయ‌డం త‌ప్పా అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. క్యాలెండ‌ర్లు మాత్ర‌మే మార‌టం లేద‌న్నారు. గుండెల నిండా ప్రేమ‌తో ప్ర‌తి ఒక్క‌రికీ హ్యాపీ న్యూ ఇయ‌ర్ అని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement