Wednesday, April 24, 2024

RRR Trailer: యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. యూట్యూబ్​లో సరికొత్త​ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్​ విడుదలైన కొద్దిసేపటికే యూట్యూబ్​లో బీభత్సమైన వ్యూస్, లైక్స్ వచ్చాయి. విడుదలైన 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తెలుగులో 20.45 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్​చరణ్ స్క్రీన్ ప్రెజన్స్​ అద్భుతంగా ఉన్నాయి.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​, అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మించారు. సినిమాని జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement