Thursday, April 25, 2024

ఆర్ ఆర్ ఆర్ ట్రైల‌ర్ రిలీజ్ వాయిదా .. ఎందుకో తెలుసా ..

స్టార్ హీరోస్ రామ్ చ‌ర‌ణ్ . ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ . ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్ర ట్రైల‌ర్ డిసెంబ‌ర్ 3న రిలీజ్ చేయ‌నున్నామ‌ని ప్ర‌క‌టించారు.. కానీ ఆర్ ఆర్ ఆర్ ట్రైల‌ర్ రిలీజ్ వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి మృతితో టాలీవుడ్ లో విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సిరివెన్నెల గౌరవార్థం ట్రైలర్ వాయిదా వేయడమే కరెక్ట్ అని ఆర్ఆర్ఆర్ టీం భావించింది.

ట్రైలర్ విడుదల కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అని చెప్పారు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ వీడియోకి దేశ వ్యాప్తంగా థండర్ రెస్పాన్స్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ గురించి జక్కన్న ఒక్కో అప్డేట్ వదులుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement