Saturday, April 20, 2024

ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ పై ‘మీమ్స్’

ఆర్ ఆర్ ఆర్ అనుకున్న స‌మ‌యానికి ఈ చిత్రం రిలీజ్ అయితే ఇపాటికి రికార్డ్ మోత మోగేది. జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తామ‌న్న చిత్ర యూనిట్ క‌రోనా వ‌ల్ల వెన‌క‌డుగు వేసింది. దాంతో ప్రేక్ష‌కులు నిరాశ చెందారు. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించాడు.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ని పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల కానుంద‌ని ఆశ‌గా ఎదురుచూసిన అభిమానులు తీవ్ర నిరాశ‌ను ఎవ‌రితో చెప్పుకోవాలో కూడా అర్థం కాక సోష‌ల్ మీడియాలో మీమ్స్ రూపంలో త‌మ క్రియేటివిటీతో అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల అయ్యేలోపు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వృద్ధులు అయిపోతారంటూ కొందరు సృష్టించిన పోస్టులు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. 50 ఏళ్ల త‌ర్వాత విడుద‌ల చేసే సినిమా షూటింగ్‌ను ఇప్పుడే తీసి పెట్టుకోవ‌డం ఎందుకంటూ నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంత‌కు ముందు బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌న్న టెన్ష‌న్ ను ప్రేక్ష‌కుల్లో ఉంచి చంపేసిన రాజ‌మౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విడుద‌ల ఎప్పుడ‌న్న టెన్ష‌న్లో ఉంచాడ‌ని చుర‌క‌లంటిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement