Saturday, May 21, 2022

RRR OTT release date: ఓటీటీలో ‘RRR’ విడుదల.. ప్రీమియర్స్ ఎప్పుడంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మూవీ ‘RRR’. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టి.. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.

కొమురం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామారాజుగా రాంచరణ్ నటించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ డేను ప్రకటించింది. ఈ నెల 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్ఆర్ఆర్ వచ్చేస్తున్నట్టు వెల్లడించింది.

తెలుగు పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన RRR.. ఈ సంవత్సరం ప్రారంభంలో అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీ.. మహమ్మారి కారణంగా అనేక సార్లు వాయిదా పడి మార్చి 25 న థియేటర్లలో విడుదలైంది. RRR ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1,127 కోట్ల కలెక్షన్‌లతో అత్యధిక వసూళ్లు రాబట్టిన నాల్గవ భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. భారతదేశంలో ఈ చిత్రం అమీర్ ఖాన్ యొక్క దంగల్‌ను అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement