Thursday, April 18, 2024

ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ సాంగ్‌.. అప్ప‌ట్లోనే చార్లీ చాప్లిన్ ఫేమ‌స్‌.. ఇదిగో వీడియో చూడండి..

ద‌ర్శ‌క ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన సినిమాలు ఎంత స‌క్సెస్ అవుతాయో మ‌నంద‌రికీ తెలిసిందే. రాజ‌మౌళి సినిమా అంటే యావ‌త్ దేశ ప్ర‌జ‌లంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. అలాగే ఈ మ‌ధ్య విడుద‌ల‌కు సిద్ధం అని ప్ర‌క‌టించి.. పోస్ట్ పోన్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లోని ఒక పాట చాలా ఫేమ‌స్ అయ్యింది. నాటు నాటు పాట‌ను రాహుల్ సిప్లిగంజ్ పాడ‌గా.. రాంచ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ చేసిన డ్యాన్స్ మ‌రో లెవ‌ల్ అనుకోవాలి…

అయితే ఇప్పుడు ఈ డ్యాన్స్‌పై చాలా మీమ్స్ వ‌స్తున్నాయి. కానీ, అప్ప‌ట్లోనే ఈ త‌ర‌హా డ్యాన్స్ ఉంద‌ని మీకు తెలుసా.. అవును.. చార్లీ చాప్లీన్ తీసిన ఓ మూవీలో ఇట్లాంటి డ్యాన్స్ ఉంద‌ని నెటిజ‌న్లు ఓ వీడియోను పోస్టు చేశారు. అచ్చం చార్లీ చాప్లిన్ చేసిన‌ట్టుగానే రాజ‌మౌళి సినిమా ఆర్ ఆర్ ఆర్ లో నాటు నాటు పాట‌కు చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ డ్యాన్స్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది.. మీరు చూసి ఎంజాయ్ చేయండి…

Advertisement

తాజా వార్తలు

Advertisement