Saturday, April 20, 2024

ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్ కి శుభ‌వార్త‌-ఒకేరోజు మూడు ఛాన‌ల్స్ లో ప్ర‌సారం

థియేట‌ర్ల‌ల‌లోనే కాదు ఓటీటీలోనూ మంచి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది ఆర్ ఆర్ ఆర్ చిత్రం. ఇతర దేశాల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ ఉన్న క్రేజ్ చూస్తే తెలుగు సినిమా సత్తా ఏంటో అర్థమవుతోంది. కాగా ఈ చిత్ర అభిమానుల కోసం ఏకంగా మూడు ఛానెల్స్ లో ఒకే రోజు ప్రసారం చేయనున్నట్టు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు ఆగస్టు 14న ‘ఆర్ఆర్ఆర్’ ఇంటింటి సందడి చేయనుంది.

ఒకే రోజు ఏకంగా మూడు ప్రముఖ ఛానెల్స్ లో ఈ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ప్రసారం కానుంది. తెలుగు వెర్షన్ ను ‘స్టార్ మా’లో సాయంత్రం 5:30కి, మలయాళ వెర్షన్ ను ప్రముఖ ఆసియా నెట్ ఛానెల్ లో రాత్రి 7:00 గంటలకు, హిందీ వెర్షన్ ను ‘జీ సినిమా’లో రాత్రి 8:00 గంటలకు ప్రసారం చేయనున్నారు. ఈ బిగ్గెస్ట్ సినిమాటిక్ ను ప్రేక్షకులు తమ ఇంట్లోనూ వీక్షించేందుకు రెడీగా ఉన్నారు. అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే యాక్షన్ సీన్స్ ను మరోసారి చూడబోతున్నందుకు ఎగ్జైట్ ఫీలవుతున్నారు. ఈ చిత్రంలో ఉద్యమ వీరులు సీతారామ రాజు, కొమురం భీం పాత్రల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రానికి నిర్మాతగా డీవీవీ దానయ్య వ్యవహరించారు. అద్భుతమైన సంగీతంతో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణీ తన మార్క్ చూపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement