Thursday, March 28, 2024

నాటు నాటు సాంగ్ కి మిలియ‌న్ లైక్స్ ..

స్టార్ హీరోస్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ , మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం చారిత్రక నేపథ్యంలో నడుస్తుంది. స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తుండ‌గా , డీవీవీ దానయ్య నిర్మింస్తున్నాడు. జ‌న‌వ‌రి 7న రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఆయన అందించిన పాటలకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా నుంచి ‘నాటు నాటు’ అనే పాటను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ – చరణ్ పై చిత్రీకరించిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూర్చగా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీని అందించాడు. పాటకి తగినట్టుగానే నాటు స్టెప్స్ పడ్డాయి. వివిధ భాషల్లో విడుదలైన ఈ పాట ఇటీవల 80 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. అలాగే 3 వారాలలో ఈ పాట మిలియన్ లైక్స్ ను సంపాదించుకుంది. తెలుగు సినిమాలకి సంబంధించి యూ ట్యూబ్ లో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి లైక్స్ ను సంపాదించుకున్న పాట ఇదేనట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement