Thursday, April 25, 2024

ఆర్ ఆర్ ఆర్ ‘నాటు నాటు’ సాంగ్ సెకండ్ సింగిల్..పోలా అదిరిపోలా..

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ అయిన నాటు నాటు అనే సాంగ్ ను విడుదల చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర యూనిట్‌. ఈ సాంగ్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌ చరణ్‌ చాలా ఎనర్జీ గా కనిపించారు. అలాగే.. లిరిక్స్‌ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఇద్ద‌రు స్టార్ హీరోలు న‌టిస్తుండ‌టం విశేషం. ఎన్టీఆర్.. రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న చిత్రం ఇది. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోంది.కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటి నటులు ఆలియాభట్ అజయ్ దేవగన్ కీలకపాత్రల‌ను పోషిస్తున్నారు.ఇక ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరీస్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement