Monday, January 30, 2023

‘అల్లూరి’గా అదిరిన రామ్ చ‌ర‌ణ్ .. ‘మెగా’ ఫ్యాన్స్ కి పండ‌గే ..

జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది ఆర్ ఆర్ ఆర్ చిత్రం. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కించారు. కాగా ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ , మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ఇన డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన పాటలకు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఈ నెల 9వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయ‌నున్నారు. నేడు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసిన టీమ్, కొంతసేపటి క్రితం అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కొత్త పోస్టర్ ను వదిలింది. శత్రువులపై విరుచుకుపడటానికి ముందు సింహనాదం చేస్తూ, ఈ పోస్టర్ లో అల్లూరిగా చరణ్ కనిపిస్తున్నాడు. ఫిరంగి గుండ్లను కూడా తన పిడికిలిలో చిదిమేసే అంత‌టి ఆగ్రహంతో కనిపిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్ మెగా అభిమానులు వైర‌ల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement