Monday, January 30, 2023

RRR: ‘రోర్ ఆఫ్ భీమ్’ సాంగ్ ప్రోమో రిలీజ్.. ఎన్టీఆర్ లుక్స్ సూపర్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ లీడ్ రోల్స్ లో నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి గురువారం ఉదయం నాలుగో పాట ‘రోర్ ఆఫ్ భీమ్’ సాంగ్ ప్రోమో విడుదలైంది. దీనికి సంబంధించిన ఫుల్ లిరికల్ సాంగ్ ను శుక్రవారం(డిసెంబర్ 24) సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ పాటను సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి కుమారుడు కాల భైరవ ఆలపించారు. 

కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించారు. అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ కు దగ్గర పడడంతో మూవీ టీం.. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు రాజమౌళి బాలీవుడ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement