Saturday, April 20, 2024

RRR Update: ‘రోర్ ఆఫ్ భీమ్’ రిలీజ్ ఎప్పుడంటే?

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా సినిమాలోని నాలుగో సాంగ్ ‘రోర్ ఆఫ్ భీమ్’ ను శుక్రవారం రిలీజ్ చేయనున్నట్లు చిత్రబందం ప్రకటించింది. ఈ పాటకు సంబంధించిన ప్రొమోను ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నారు.

అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించారు. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement