Tuesday, April 16, 2024

మైనార్టీ బంధు ఇవ్వండి.. గర్జించిన రేవంత్

తెలంగాణ దళిత సాధికార కోసం ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దళిత బంధులా మైనార్టీ బంధు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో మైనార్టీ గర్జన సభ జరుగింది. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ  దేశానికి స్వాంతంత్ర్యం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. దేశం కోసం కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు వచ్చాయని… వైయస్సార్ హయాంలో రిజర్వేషన్లు కల్పిస్తే, ఎంతో మంది మైనార్టీలకు ఉద్యోగ, విద్య అవకాశాలు వచ్చాయని గుర్తు చేశారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెపితేనే టీఆర్ఎస్ కు మైనార్టీలు ఓట్లు వేశారని అన్నారు. మైనార్టీలకు శత్రువైన కేసీఆర్ ను కొట్టాలంటే మధ్యలో ఒవైసీ అడ్డున్నాడని చెప్పారు. మైనార్టీలకు ఎవరి వల్ల నష్టం జరుగుతోందో చెప్పడానికే మైనార్టీ గర్జనను చేపట్టామని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను ఇస్తామన్న హామీని కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని… 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే మైనార్టీలకు 20 నుంచి 30 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మైనార్టీ ఓట్లతో సీఎం అయిన కేసీఆర్… ప్రతి ముస్లిం కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితబంధు మాదిరే మైనార్టీబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కారును, పతంగిని నమ్ముకుంటే మోసపోయేది ముస్లింలేనని సూచించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీ బడ్జెట్, వక్ఫ్ బోర్డు జ్యుడీషరీ పవర్స్ కల్పిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగిందన్నారు. రాష్ట్రపతి, సీఎం పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్, ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను కాంగ్రెస్ మాత్రమే వ్యతిరేకించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ కు 200 మంది ఎంపీలు ఉంటే ఈ చట్టాలు చేసే ధైర్యాన్ని బీజేపీ చేసేది కాదన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

ఇది కూడా చదవండిః ఆగస్టు 14 ఇకపై ‘విభజన విషాద సంస్మరణ దినం’

Advertisement

తాజా వార్తలు

Advertisement