Thursday, April 25, 2024

దళితులకు అండగా ఉంటా.. గడీల పాలనను పారదోలుతా: రేవంత్

ఈనెల 18న ఇబ్రహీంపట్నంలో దళిత, గిరిజన రెండో సభ నిర్వహించనున్నామని టీ.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. స్వేచ్ఛ, స్వయం పాలన కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. ఇకపై కాంగ్రెస్‌లో పార్టీని నమ్ముకున్న వారికే పదవులు ఉంటాయని స్పష్టం చేశారు. ఇందిరమ్మ పాలనలోనే ఎస్సీలకు అసైన్డ్‌ భూములు వచ్చాయని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత, గిరిజన రెండో సభలో రేవంత్ ప్రసంగించారు. కార్యక్రమం విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు.

ఇంద్రవెల్లి పేరు స్మరిస్తే ఎంతో స్ఫూర్తి రగులుతుందని టీపీసీసీ చీప్​ రేవంత్​ రెడ్డి అన్నారు. స్వేచ్ఛ కోసం పోరాడి, ప్రాణాలు ఇచ్చిన నేల ఇంద్రవెల్లి అని ఆయన గుర్తు చేశారు. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుమురం భీం పోరాడారని చెప్పారు. ఒకప్పుడు ఆదిలాబాద్‌ పేరు చెపితే పోరాట యోధులు గుర్తుకు వచ్చేవారని… ఇప్పుడేమో కేసీఆర్‌ అడుగులకు మడుగులొత్తే నేతలు గుర్తుకు వస్తున్నారని విమర్శించారు. దళిత సోదరులకు అండగా ఉంటానని రేవంత్ భరోసా ఇచ్చారు. దళితుడికి రాష్ట్రపతి పదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్‌ను చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తు చేశారు. రిజర్వేషన్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్‌ పార్టీనేనని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఉపఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు దళితులు గుర్తుకు వచ్చారని, కేసీఆర్ మంత్రివర్గంలో మాదిగలకు స్థానమే లేదని విమర్శించారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు తోడు, నీడగా ఉంటానని రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సమైక్యపాలనలో అడవి బిడ్డలను కాల్చేస్తుంటే… ఈ ప్రాంత నేతలు నిస్సహాయులుగా నిలిచిపోయారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

 ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌కూ అన్యాయం జరిగిందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అమరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్‌దేనని అన్నారు. ఎందరో ఎస్సీలు, ఎస్టీలకు కీలక పదవులను ఇచ్చింది కాంగ్రెస్సేనని అన్నారు. రిజర్వేషన్ల విధానాన్ని తీసుకువచ్చిందే కాంగ్రెస్‌ పార్టేనని తెలిపారు. తెలంగాణకు ఎస్సీ నేతను తొలి సీఎం చేస్తానని కేసీఆర్‌ అన్నారని… కానీ ఎస్సీని ఉపముఖ్యమంత్రిని చేసి రెన్నెళ్లకే కేసీఆర్‌ తొలగించారని విమర్శించారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీలకు చోటు దక్కలేదని ఆయన ఆరోపించారు. ఆదివాసీల జీవితాలు మార్చాలనేదే కాంగ్రెస్‌ ప్రణాళికలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కోసమే పథకాలు తెచ్చానని సీఎం ఒప్పుకున్నారని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు ఎస్సీలు గుర్తుకు వచ్చారని… దళితబంధును అన్ని నియోజకవర్గాల్లో ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. రూ.4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. కాంట్రాక్టులు, కమీషన్ల ద్వారా వేల కోట్లను కేసీఆర్‌ కుటుంబం దోచుకుందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ కు రూ.500 కోట్లు.. దళిత బంధు నిధులు విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement