Saturday, April 20, 2024

ఎన్టీఆర్ న‌ట‌న‌కి గౌర‌వం – తెలంగాణ ఇంగ్లీష్ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ లో హీరోపై ప్ర‌శ్న‌

ఆర్ ఆర్ ఆర్ ఈ చిత్రం రీసెంట్ గా రిలీజ్ అయి ఘ‌న విజ‌యాన్ని సాధించింది. కాగా ఈ సినిమాని స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కించారు. ఇది ఇలా ఉండ‌గా.. తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ ఫైన‌ల్ ఎగ్జామ్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌శ్న అడ‌గ‌టం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీమ్ పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రశ్న అడిగారు. ఒకవేళ మీరు ఒక ప్రముఖ ఛానల్ లో రిపోర్టర్ అయితే.. ఈ సినిమా విజయం పట్ల ఎన్టీఆర్ ని ఎలా ఇంటర్వ్యూ చేస్తారో వివరంగా రాయండని అడిగారు. ఇంటర్ ఎగ్జామ్ లో ఎన్టీఆర్ గురించి ప్రశ్న అడగటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ క్వశ్చన్ పేపర్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ నటనకు దక్కిన గౌరవం అంటూ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement