Saturday, November 27, 2021

శ్రీన‌గ‌ర్ లో కాల్పులు..ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం..

ఉగ్ర‌వాదుల ఏరివేత‌ను సీరియ‌స్ గా తీసుకున్నాయి జ‌మ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ,సీఆర్ఫీఎఫ్ బ‌ల‌గాలు. ఇప్ప‌టికే వ‌రుస‌గా ఎన్ కౌంట‌ర్ ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. రీసెంట్ గా మరోసారి జమ్మూకాశ్మీర్ లో తుపాకుల మోత మోగింది. ఈరోజు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టు పెట్టాయి. శ్రీనగర్ లోని రాంభాగ్ లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. మరణించిన ముగ్గురు ఉగ్రవాదులు ది రెసిస్టెంట్ ఫోర్స్(టీఆర్ఎఫ్) కు సంబంధించిన వారిగా గుర్తించారు. రెసిస్టెంట్ ఫోర్స్, లష్కర్ ఏ తోయిబాకు అనుబంధంగా పనిచేస్తుంది.. గతంలో కాశ్మీర్ లో నాన్ లోకల్స్ ను చంపిన ఘటనల్లో ఈ సంస్థే కీలకంగా వ్యవహరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News