Saturday, April 20, 2024

Breaking | రాజ్‌భ‌వ‌న్‌లో గ‌ణ‌తంత్ర వేడుక‌లు.. కేంద్రాన్ని పొగుడుతూ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం

రాజ్ భవన్ లో అధికారికంగా గణతంత్ర వేడుకలు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ జాతీయ జెండా ఎగురేసి ప్ర‌సంగించారు. రిప‌బ్లిక్ డే కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్‌తో పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, డీజీపీ అంజ‌నీకుమార్ పాల్గొన్నారు. సైనిక బ‌ల‌గాల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు.

కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తూ గవర్నర్ ప్రసంగం కొన‌సాగింది. తెలంగాణలో పెద్ద ఎత్తున జాతీయ రహదారులను నిర్మించిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. వందే భారత్ రైలు కేటాయించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.

కాగా, సీఎం కేసీఆర్‌పై ప‌రోక్షంగా కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. తాను కొంద‌రికి న‌చ్చ‌క‌పోవ‌చ్చ‌ని, అయితే.. తెలంగాణ గౌర‌వాన్ని, హ‌క్కుల‌ను కాపాడుకుందామ‌ని గ‌వ‌ర్న‌ర్ అన్నారు. తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుదామ‌న్నారు. రాష్ట్ర అభివృద్ధిలో త‌న పాత్ర ఉంటుందని, తెలంగాణ గౌర‌వాన్ని నిల‌బెడ‌దామ‌న్నారు. నిజాయితీ, ప్రేమ‌, హార్డ్‌వ‌ర్క్ త‌న బ‌లమ‌ని గ‌వ‌ర్న‌ర్ చెప్పారు. అదేవిధంగా ఫామ్‌హౌస్‌లు క‌ట్ట‌డం తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్‌కి నిద‌ర్శ‌నం కాద‌ని గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రిపై ఇండైరెక్ట్ గా గవర్నర్ విమర్శలు చేశారు. ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -

https://www.facebook.com/watch/?v=701535708283747

https://www.facebook.com/DrTamilisaiGuv/videos/unfurling-of-national-flag-on-the-occasion-of-republic-day-celebrations-at-raj-b/701535708283747/

Advertisement

తాజా వార్తలు

Advertisement