Monday, March 25, 2024

రీనో ఎయిర్ రేస్ షోలో విషాదం-కుప్ప కూలిన జెట్-పైల‌ట్ మృతి

రీనో ఎయిర్ రేస్ షోలో విషాదం చోటు చేసుకుంది. ఫైనల్స్ కోసం పోటీప‌డుతున్న ఓ జెట్ విమానం.. అదుపు త‌ప్పి నేలపై కుప్ప‌కూలింది. కూలిన స‌మ‌యంలో భారీ స్థాయిలో మంట‌లు వ్యాపించాయి. విమాన భాగాలు చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో రిలీజైంది. ఈ ఘ‌ట‌న‌లో ఆ జెట్ విమాన పైల‌ట్ మృతిచెందాడు. జెట్ పేలిన ఘ‌ట‌న త‌ర్వాత ఆ రేస్‌కు సంబంధించిన ఈవెంట్ల‌ను ర‌ద్దు చేశారు. ఈ సంఘ‌ట‌న అమెరికాలోని నెవ‌డాలో జ‌రిగింది. జెట్ విమానం నేల‌ను తాకిన త‌ర్వాత అగ్నిగోళం త‌ర‌హాలో ద‌ట్ట‌మైన మంట‌లు వ్యాపించాయి. రీనో ఎయిర్ రేస్‌లో భాగంగా చివ‌రి రోజు జ‌రుగుతున్న చాంపియ‌న్‌షిప్ రౌండ్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. జెట్ గోల్డ్ రేస్‌లోని మూడ‌వ ల్యాప్ జ‌రుగుతున్న‌ప్పుడు జెట్ కూలింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement