Friday, March 29, 2024

Red Sanders: అంత‌రించిపోయే జాబితాలో ఎర్ర చంద‌నం.. డేంజ‌ర్ జోన్‌లో చేర్చిన ఐయూసీఎన్‌

ఎర్ర చంద‌నాన్ని అంత‌రించిపోయే ప్ర‌మాదం ఉన్న జాబితాలో ఐయూసీఎన్ చేర్చింది. 2018 నుంచి ప్ర‌మాదంలో ప‌డే (near threatened) జాబితాలో ఈ చెట్టు ఉన్న‌ట్టు ఇంట‌ర్నేష‌న‌ల్ యూనియ‌న్ ఫ‌ర్ క‌న్జ‌ర్వేష‌న్ ఆఫ్ నేచ‌ర్ (IUCN) తెలిపింది.

ఎర్ర చంద‌నం అంటే తెలియని వారుండరు. ఈ చెట్లు కేవ‌లం ఇండియాలోనే ఉంటాయి అందులోనూ ముఖ్యంగా తూర్పు క‌నుమ‌ల్లో మాత్ర‌మే ఈ చెట్లు పెరుగాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌ల్లో ఎర్ర‌చంద‌నం చెట్లు విస్త‌రించి ఉన్నాయి. ఇవి పెర‌గ‌డానికి వేడి, పొడి వాతావ‌ర‌ణం కావాలి. అలాగే రాళ్లుండే, బీడుబారిన నేల‌లు వీటికి అనుకూలం. అయితే ఈ చెట్లు ప్ర‌స్తుతం అంత‌రించిపోయే జాబితాలోకి చేరాయి. ఐయూసీఎన్ రెడ్ లిస్టులోని ఎండేంజ‌ర్డ్ జాబితాలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. సైట్స్ అపెండిక్స్ 2లో ఇండియాలోని వైల్డ్ లైఫ్ ప్రొటెక్ష‌న్ యాక్ట్ 1972 షెడ్యూల్ 2లో వీటిని చేర్చారు.

అయితే.. ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను చికిత్స‌లు, ఔష‌ధాల్లో వాడ‌తారు. ఈ చెట్ల‌లో మంచి ఔష‌ధ గుణాలున్నాయి. వ‌స్తువులు చేయ‌డానికి కూడా వాడ‌తారు. ఎర్ర చంద‌నంతో చేసిన‌ వ‌స్తువుల‌కు అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చాలా విలువ ఉంది. ఒక ట‌న్ను ఎర్ర చంద‌న దాదాపు రూ.50 ల‌క్ష‌ల నుంచి రూ. కోటి వ‌ర‌కు ప‌లుకుతున్న‌ట్టు అంచ‌నా.

Advertisement

తాజా వార్తలు

Advertisement