Thursday, April 25, 2024

రెడ్ అల‌ర్ట్.. కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు..

కేర‌ళలో కుండ‌పోత వాన‌లు కురుస్తున్నాయి. భారీ వ‌ర్షాల‌తో అయిదు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది అక్క‌డి ప్ర‌భుత్వం. కాగా, ఏడు జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్, మ‌రో రెండు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ ఉన్న‌ట్టు తెలిపింది వాతావ‌ర‌ణ శాఖ‌. అయితే ఇడుక్కి జిల్లాలో ఓ కారు వ‌ర‌ద‌ల్లో చిక్కుకుంది. ఆ కారులో మ‌హిళ ఉన్న‌ట్టు గుర్తించారు. కిలోమీట‌రు దూరం వ‌ర‌ద‌లో కొట్టుకుపోగా.. రెస్క్యూ చేసి కారును బ‌య‌టికి తెచ్చారు. కానీ, కారులో ఉన్న మ‌హిళ మాత్రం గ‌ల్లంతైన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement