Friday, April 19, 2024

ఆర్​సీ 15.. చరణ్​ మరో సినిమా.. బర్త్​డేకి ఫస్ట్​ లుక్​..

రాంచ‌ర‌ణ్​ ‘ఆర్ ఆర్ ఆర్’ త‌ర్వాత శంకర్ దర్శకత్వంలో మ‌రో సినిమా చేయ‌నున్నట్టు తెలుస్తోంది. దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. RC 15 గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా ఇది. అందువలన ఆయన ఈ సినిమా విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్​ చేసుకున్నట్టు సమాచారం. తదుపరి షెడ్యూల్ షూటింగుకి సన్నాహాలు జరుగుతున్నాయి. చరణ్ పుట్టినరోజైన మార్చి 27వ తేదీన ఆయన ఫస్టు లుక్ ను రిలీజ్ చేసే ఆలోచనలో సినీ యూనిట్​ ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాని క‌నిపించ‌నుంది. గతంలో ఆమె చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లో సందడి చేసిన సంగతి తెలిసిందే. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, శ్రీకాంత్ .. అంజలి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నట్టు ఫిలింనగర్​ వర్గాల సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement