Wednesday, March 27, 2024

అక్క‌డి ప్ర‌భుత్వ వైఫ‌ల్యంతోనే తెర‌పైకి రాయ‌ల తెలంగాణ‌.. జ‌గ‌దీష్ రెడ్డి

ఏపీ ప్రభుత్వ వైఫల్యాలతోనే రాయల తెలంగాణ అంశం తెరమీదకు వచ్చిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు.సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌ జెండా పండుగా సందర్భంగా గులాబీ జెండాను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ… ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదన్నారు. తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోవడమే రాయల తెలంగాణ డిమాండ్‌కు కారణమని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న పథకాలను చూసి.. చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని తెలిపారు.

ఇది కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణలో కలపండి లేకపోతే మా దగ్గరికి రండి అని కేసీఆర్‌ని ఆహ్వానిస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ బంగారు తెలంగాణ మారినట్లుగానే.. సువర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమేనని గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. పాలకుల చిత్తుశుద్ధి లోపంతో ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయన్నారు. పరిపాలకులను మార్చండి సువర్ణాంధ్రగా మార్చుకోవాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, వెనుకబాటుకు కారణమైన పారిపాలకుల మీద ఆంధ్ర ప్రజలు తిరుగుబాటు చేయాలన్నారు. అభివృద్ధి సాధించే నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా ఆంధ్ర ప్రజలు, నాయకులు ఆలోచించాలని సూంచించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్‌ సాకారమవుతుందని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement