Sunday, February 5, 2023

Bigg Boss 5: రవికి అంత సీన్ లేదన్న భార్య.. షన్నుకి క్లాస్ పీకిన అమ్మ!

తెలుగు అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సిజన్ 5 తుది అంకానికి చేరుతోంది. మరో మూడు వారాల్లో ఈ షో పూర్తి కానుంది. దాదాపు 82 రోజులుగా కుటుంబ సభ్యులకు దూరం ఉంటున్న హౌస్ మేట్స్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంటి సభ్యులను వారి ఫ్యామిలీ మెంబర్స్  కలిసేలా ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా ఇప్పటి మానస్, కాజల్, సిరి, శ్రీరామ్ కుటుంబ సభ్యులకు ఇంట్లోకి వచ్చి వెళ్లారు. తాజాగా నిన్నిటి ఎపిసోడ్ లో మిగిలిన ఇంటి సభ్యుల ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. రవి భార్య, కూతురు సందడి చేశారు.

స‌న్నీ తల్లి కళావతి వెళ్లిన తర్వాత.. ప్రియాంక సోద‌రి మ‌ధు ఇంట్లోకి అడ‌గుపెట్టింది. ఆమె వచ్చీరావడంతోనే నాన్నగురించి అడిగింది. అయితే నాన్నకు కళ్ల ప్రాబ్లమ్‌ ఉంది కాబట్టి రాలేదని చెప్పింది. నాన్నకు ఇచ్చిన మాట నిలెబట్టుకో. గేమ్‌పై మాత్ర‌మే ఫోక‌స్ చేయ‌మ‌ని చెప్పింది. అనంతరం, ర‌వి ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ముందుగా భార్య నిత్య వచ్చింది. ఈ సందర్భంగా రవి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. కూతురు వియా రాలేదా అని అడిగాడు. భార్యతో మాట్లాడుతుండగా.. ఇంత‌లోనే వియా వాయిస్ వినిపించ‌డంతో ప‌రుగెత్తుకుంటూ మెయిట్ గేట్ దగ్గరకు వెళ్లాడు రవి. వియాని చూడగానే గట్టిగా హగ్ చేసుకున్నాడు. పాపని ఇళ్లంతా చూపించాడు. తన కూతురితో చాలా సేపు రవి ఆడుకున్నాడు. హౌజ్‌మేట్స్ కూడా వియాని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.

- Advertisement -
   

ఇక నిత్య హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ.. ర‌విని ఇంఫ్లూయెన్స్ అంటారు కానీ అక్కడ అంత లేదు అని అంటుంది. నిత్య మాటతో షణ్ను, సిరి నవ్వేస్తారు. దానికి రవి కూడా షణ్నుని ఆమోమయం బ్రహ్మగా పేలుస్తానని చెప్పాడు. షణ్ను తనకు చిన్న తమ్ముడు అని భార్య నిత్యకు చెబుతాడు రవి. నీకు ఎన్ని పేర్లు పెట్టారో అందరికీ తెలుసు. కానీ అవేమీ నిన్ను ఎఫెక్ట్ చేయలేదని నిత్య చెబుతుంది. అనంతరం బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లే ముందు వియా క‌న్నీరు పెట్టుకుంది. నిత్య ఏడుస్తుండటంతో వియా కూడా ఏడ్చేస్తుంది. అయితే, తన పాపను రవి ఊకోబెడతాడు. అనంతరం రవి ఫ్యామిలీ ఇంటి నుంచి వెళ్లారు. భార్య, పాపని చూసిన తర్వాత రవి ఎమోషనల్ గా హ్యాపీ ఫీల్ అయ్యాడు.

 

అఖరిలో ష‌ణ్ముఖ్ మ‌ద‌ర్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె వ‌చ్చి రావ‌డంతో షణ్నును గ‌ట్టిగా హ‌త్తుకొని ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆ త‌ర్వాత కొడుకుతో క‌లిసి కొద్ది సేపు ముచ్చ‌టించారు. మార్నింగ్ డ్యాన్స్ చేయడం లేదని.. అందరితో డ్యాన్స్ వేసి గుడ్ మార్నింగ్ చెబితే మాకు చెప్పినట్టు అనిపిస్తుంది అని ష‌ణ్ముఖ్ త‌ల్లి చెప్పింది. నా బాండ్ ఎవరితో బాగుంది.. రవితోనా? సిరితోనా? అని షన్ను అడుగుతాడు. ఎపిసోడ్ లో ష‌ణ్ముఖ్ మ‌ద‌ర్ కూడా వ‌చ్చారు. ఆమె వ‌చ్చి రావ‌డంతో త‌న కొడుకుని గ‌ట్టిగా హ‌త్తుకొని ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆ త‌ర్వాత కొడుకుతో క‌లిసి కొద్ది సేపు ముచ్చ‌టించారు. మార్నింగ్ డ్యాన్స్ చేయమని అన్నాను.. ఓ రెండు రోజులే చేశావ్.. మళ్లీ చేయడం లేదు.. అక్కడ అందరితో డ్యాన్స్ వేసి గుడ్ మార్నింగ్ చెబితే మాకు చెప్పినట్టు అనిపిస్తుంది అని ష‌ణ్ముఖ్ త‌ల్లి పేర్కొంది. నా బాండ్ ఎవరితో బాగుంది.. రవితోనా? సిరితోనా? అని షన్ను అడుగుతాడు.

దీంతో అందరితో ఉండు.. ఒకరితోనే ఉండకు. ఒక మూలకు వెళ్లి ఒకరితోనే ఉండకు అంటూ క్లాస్ తీసుకుంది. ఇక దీప్తి గురించి షన్ను అడగ్గా.. అంతా బాగున్నారని చెప్పింది. నేను ఎలా ఆలోచిస్తున్నానో తాను అలానే ఆలోచిస్తుంది. నువ్వు గేమ్ బాగా ఆడు అని సూచించింది. ఇంట్లో ఎలా ఉంటున్నావో ఇక్కడ కూడా అలానే ఉంటున్నావు అని చెప్పింది. గేమ్ నీ కోసం నువ్ ఆడు.. ఎవరు అలిగినా కూడా వెళ్లి ఎమోషనల్ అవ్వకు.. షన్ను మదర్ పేర్కొంది. అనంతరం ఇంటి సభ్యులతో మాట్లాడి వెళ్లారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement