Thursday, April 25, 2024

సౌర‌వ్ గంగూలీకి అరుదైన గౌర‌వం..

ఐసీసీ పురుషుల క్రికెట్ క‌మిటీ ఛైర్మ‌న్ గా బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీని నియ‌మించారు. దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు సమావేశం లో ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్‌ గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని నియామకం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో సౌర‌వ్ కి అరుదైన గౌర‌వం ల‌భించింది. గత కొన్ని ఏళ్లుగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. క్రికెట్ కు చేస్తున్న.. సేవలకు ఈ పదవి ఇస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పష్టం చేసింది .ఐసిసి పురుషుల క్రికెట్ కమిటీ అధ్యక్ష పదవికి సౌరవ్‌ను స్వాగతిస్తున్నందుకు తాను సంతోషిస్తున్నానని… ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు గంగూలీ అని ICC ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే అన్నారు. బీసీసీఐ సభ్యులతో పాటు.. క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement