Wednesday, March 27, 2024

రేర్​ చైల్డ్​హుడ్​ వీడియో.. విజయ్​ మాల్యా ఇట్లానే చేసేవాడేమో? (వీడియో)

సోష‌ల్ మీడియా అంటేనే వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు నిద‌ర్శ‌నం.. ఎవ‌రి వార్త‌లు వాళ్ల‌వే. ఎవ‌రికి తోచింది వారు పోస్టు చేస్తుంటారు. ఇట్లాంటివాటిలో కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటాయి. సాగ‌ర్ అనే వ్య‌క్తి ఓ వీడియోను ట్వీట్ చేస్తే దాన్ని చాలామంది రీట్వీట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అదేంటంటే.. ఆ వీడియోలో ఓ బాలుడు ఇంటికి వేసిన ఇనుప డోర్ నుంచి ఈదుకుంటూ.. దాంట్లోంచి దూరి మ‌రీ బ‌య‌టికి వెళ్తుంటాడు. ఆ త‌ర్వాత మ‌రో డోర్ ఉంటుంది. దాన్ని కూడా చాక‌చ‌క్యంగా తీసుకుని బ‌య‌టికి వెళ్తాడు. అయితే దీన్ని బిజినెస్ మ‌న్ విజ‌య్ మాల్యాకు లింక్ చేస్తూ ఈ ట్వీట్ చేయ‌డం ఫ‌న్నీగా ఉంది. ఎందుకంటే విజ‌య్‌మాల్యా కూడా దేశంలో ఆర్థిక మోసాలు చేసి విదేశాల‌కు వెళ్లి స్థిర‌ప‌డ్డ వ్య‌క్తిగా అంద‌రికీ తెలిసిందే.. ఈ వీడియోలో ఉన్న బాలుడు చిన్నప్పటి విజ‌య్ మాల్యాగా పేర్కొన‌డం.. ఇలాగే చేసేవాడేమో అని ఇవ్వడం ఇక్క‌డ మ‌రింత ఫ‌న్నీగా ఉంది.. ఇందులో కూడా మొద‌టి గేట్ యూపీఏ అయితే.. రెండో గేట్‌ని ఎన్‌డీఏ గేట్‌గా పేర్కొంటూ రీట్వీట్ల జోరు కొన‌సాగుతోంది..

ఈ వీడియో కోసం www.prabhanews.com క్లిక్​ చేసి వీడియో ట్యాబ్​లో చూడొచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement