Saturday, April 20, 2024

ఎన్టీఆర్ , రామ్ చ‌ర‌ణ్ తో – రాఖీ సావంత్

ఆర్ ఆర్ ఆర్ సెల‌బ్రేష‌న్స్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీసావంత్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. ఈ సెలబ్రేషన్స్ లో ‘నాటు నాటు ’ స్టెప్స్ వేసిన ఈ భామ..తన ఫేవరెట్ హీరో రామ్ చరణ్ ను కలిశానని చెప్పింది. తారక్ తోనూ ముచ్చటించిన ఈ సుందరి.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అది నెట్టింట తెగ వైరలవుతోంది. రాఖీ సవంత్ హ్యాపీగా రామ్ చరణ్, తారక్ లతో ముచ్చటిస్తుండగా అది చూసి వావ్ అంటున్నారు నెటిజన్లు. రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువ‌ల్ వండర్ RRR ను ఉత్తరాదిలో పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడిగా రాజమౌళి పేరు చరిత్రలో నిలిచిపోనుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement