Wednesday, March 27, 2024

కొవిడ్ చికిత్సలో కొత్త మందు.. 2డీజీ ఔషదం విడుదల

దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య లక్షల్లో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా  బాధితుల కోసం డాక్టర్ రెడ్డీస్, డీఆర్డీవో సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2 డీజీ (2డీఆక్సీ డీగ్లూకోజ్) ఔషధం విడుదలైంది. ఈ మందును సోమవారం ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ విడుదల చేశారు. ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో 10 వేల ప్యాకెట్ల(డోసుల)ను పంపిణీ చేయనున్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన ఈ మందును హైదరాబాద్​కు చెందిన రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఉత్పత్తి చేస్తోంది.

కరోనాకు వ్యాక్సిన్లే తప్ప మందులు ఇప్పటివరకూ లేవు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ 2 డీజీ పొడిని తయారు చేసింది. దీన్ని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని… భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఈ మందు ఫేజ్ 2, 3 క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయి. పొడి రూపంలో ఉండే ఈ మందును నీటిలో కలుపుకొని తాగవచ్చు. 2డీజీ మందుతో పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం తగ్గుతుందని, హాస్పిటల్ లో ఉండాల్సిన రోజులూ తగ్గుతాయని చెప్తున్నారు. ఇది అన్ని వయసుల వారికి పని చేస్తుందని, డ్రగ్​ తీసుకున్న పేషెంట్లలో రెండు మూడు రోజుల్లోనే తేడా కనిపించిందని నిపుణులు చెబుతున్నారు.

ఈ 2 డీజీ మందు ద్వారా కరోనా పేషెంట్లు త్వరగా రికవరీ అవుతున్నారు. అంతేకాదు… మెడికల్ ఆక్సిజన్‌పై ఆధారపడే సమయం కూడా తగ్గుతోంది. ఇలా ఇది మంచి ఫలితాలు ఇస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఉత్పత్తి హైదరాబాద్‌ సహా పలు కేంద్రాల్లో త్వరలో ప్రారంభం కానుంది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (INMAS) ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. ఇది స్వల్ప నుంచి మోస్తరు కరోనా లక్షణాలతో బాధ‌ప‌డుతున్న రోగులపై బాగా పనిచేస్తుందని, క‌రోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అద‌నంగా ఈ ఔష‌ధాన్ని ఇస్తే వారు వేగంగా కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని డీఆర్డీఓ పేర్కొంది.

ఇది కూడా చదవండి: ఏపీలో కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15వేలు ఆర్థిక సాయం

Advertisement

తాజా వార్తలు

Advertisement