Thursday, April 25, 2024

మిల్లర్, మోరిస్ పోరాటం.. ఢిల్లీపై రాజస్థాన్ గెలుపు

ఐపీఎల్‌లో గురువారం రాత్రి మరో థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్ ఆటగాళ్ల పోరాటం కారణంగా ఓడిపోవాల్సిన రాజస్థాన్ అద్భుత గెలుపును నమోదు చేసింది. గత రెండు మ్యాచ్‌లలో ఛేజింగ్ చేసిన జట్టు ఓడిపోగా ఈ మ్యాచ్‌లో మాత్రం ఛేజింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. చివరి రెండు ఓవర్ల వరకూ ఢిల్లీ వైపు మొగ్గిన మ్యాచ్ ఆపై క్రిస్ మోరిస్ విధ్వంసకర బ్యాటింగ్ (18 బంతుల్లో నాలుగు సిక్స్ లతో 36)తో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ జట్టు 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ (51) ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కత్ 3, ముస్తాఫిజుర్ 2 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. బట్లర్ 2, వోహ్రా 9, సంజూ శాంసన్ 4, శివమ్ దూబే 2 పరుగులు చేసి అవుట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమి దిశగా వెళుతుందనే అందరూ భావించారు అయితే డేవిడ్ మిల్లర్ (62) రాకతో పరిస్థితి మారింది. మిల్లర్‌కు తోడుగా తెవాటియా 19, ఉనద్కత్ 11, రబాడ 19, మోరిస్ 36 పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement