Sunday, December 5, 2021

రాజ‌స్థాన్ మంత్రివ‌ర్గంలో 15మందికి చోటు..వారెవ‌రో తెలుసా..

రాజ‌స్థాన్ లో రాజ‌కీయాలు వేడెక్కాయి. రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ త‌న మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రింప‌జేశారు. కొత్తగా రాజ‌స్థాన్ మంత్రివ‌ర్గంలో చేరిన వారిలో హేమంత్ చౌద‌రి, గోవింద్ రామ్ మేఘ్వాల్‌, శకుంత‌ల రావ‌త్, బ్రిజేంద్ర సింగ్ ఓలా, మురారీలాల్ మీనా, ర‌మేశ్ మీనా, మ‌మ‌తా భూపేష్ బైర్వా, భ‌జ‌న్‌లాల్ జాత‌వ్‌, తీకారామ్ జూలీ, మ‌హేంద్ర‌జీత్‌సింగ్ మాల్వీయ‌, రామ్‌లాల్ జాట్‌, మ‌హేష్ జోషి, విశ్వేంద్ర‌సింగ్‌, రాజేంద్ర గడ్డా, జ‌హీదా ఖాన్ ఉన్నారు. మొత్తం 15 మందికి త‌న మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించారు. అందులో 11 మందిని కేబినెట్ హోదాలో మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. ఈ ప‌దిహేను మంది నూత‌న మంత్రుల చేత రాజ‌స్థాన్ గ‌వ‌ర్న‌ర్ కల్‌రాజ్ మిశ్రా ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. జైపూర్‌లోని రాజ్‌భ‌వ‌న్‌లో ఈ ప్ర‌మాణస్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News