Monday, March 27, 2023

రాజాసింగ్ కామెంట్స్ పై పాత‌బ‌స్తీలో ఆందోళ‌న‌-పోలీసుల వాహ‌నం ధ్వంసం

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్ పై హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోని ప‌లు చోట్ల ఆందోళ‌న చేప‌ట్టారు ముస్లిం నిరసనకారులు. ఓల్డ్ సిటీ లో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేసిన ఓ వర్గం.. శాలిబండ, హుస్సేనీ ఆలం, చార్మినార్ పీఎస్ పరిధిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.అర్థరాత్రి చార్మినార్ దగ్గరికి భారీగా ఆందోళన కారులు వచ్చి నిరసన తెలిపారు. చార్మినార్ దగ్గర పరిస్థితిని సమీక్షించి.. ఆందోళనకారులను క్లియర్ చేసారు సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య. ఈ తరుణంలోనే పోలీసు వాహనాన్ని రాళ్లతో కొట్టి ధ్వంసం చేశారు ఆందోనళకారులు. మరోసారి తెల్లవారు జామున మూడు గంటలకు మళ్ళీ చార్మినార్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి.. నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. పరిస్థితిని సమీక్షించారు అడిషనల్ సీపీ చౌహన్. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులతో మాట్లాడి.. వారిని ఇళ్లకు పంపించారు మలక్ పెట్ ఎమ్యెల్యే అహ్మద్ బలాల.

Advertisement

తాజా వార్తలు

Advertisement