Tuesday, April 16, 2024

ఈనెల 15 నుంచి రైతుల ఖాతాల్లోకి ‘రైతు బంధు’ జమ

తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఈ నెల 15 నుంచి రైతుబంధు సాయం ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ మారిన బ్యాంకుల ఖాతాల్లోనూ నిధులు జమవుతాయని చెప్పారు. ఇటీవల పలు బ్యాంకులు విలీనమవగా.. ఆయా బ్యాంకుల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్లు మారాయి. ఈ క్రమంలో ఆయా బ్యాంకుల్లో ఖాతాలున్న రైతుల ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు మంత్రి స్పష్టతనిచ్చారు. ఈ నెల 10వ తేదీలోపు రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఏమైనా సందేహాలు లేదా ఇతర వివరాల కోసం రైతులు రైతులు స్థానిక ఏఈఓలను సంప్రదించి.. నివృత్తి చేసుకోవాలని సూచించారు. బ్యాంకు ఖాతా, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు వివరాలను రైతులు వ్యవసాయాధికారులకు అందజేయాలన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు ధరిణిలో నమోదైన రైతులందరికీ సాయం ఖాతాల్లో జమవుతుందని తెలిపారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement