Friday, April 19, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులపాటు వర్షాలు!

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని హిందూ మహాసముద్ర పరిసరాల్లో కొనసాగుతోంది.  నేడు మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని అధికారులు తెలిపారు. రేపు ఇది తమిళనాడు తీరం దిశగా దూసుకొస్తుందని, ఫలితంగా రేపటి నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement