Saturday, April 20, 2024

HYD: చంచల్ గూడ జైలులో రాహుల్.. NSUI నేతలతో ములాఖత్

చంచల్ గూడ జైలులో NSUI నేతలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ములాఖత్ అయ్యారు. మధ్యాహ్నం చంచల్ గూడ జైలుకు వెళ్లి NSUI నేతలను పరామర్శించారు. అయితే, ములాఖత్ కు ఇద్దరికి మాత్రమే జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. దాంతో రాహుల్ తో పాటు భట్టి నేతలను పరామర్శించారు. తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన పార్టీ విద్యార్ధి విభాగం ఎన్ఎస్‌యూఐ నేత‌ల‌ను ఆయ‌న క‌లిశారు. అరెస్టుల‌కు భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని, పార్టీ అండ‌గా ఉంటుంద‌ని ఈ సంద‌ర్భంగా ఎన్ఎస్‌యూఐ నేత‌ల‌కు రాహుల్ భ‌రోసా ఇచ్చారు. రాహుల్ వెంట మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క మిన‌హా మ‌రెవ్వ‌రినీ పోలీసులు జైలులోకి అనుమ‌తించ‌లేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా పోలీసులు అనుమ‌తించ‌లేదు. 

రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలు దగ్గరికి రావడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఏఐసీసీ నుంచి తెలంగాణ జైళ్ల శాఖ‌కు అందింది. పార్టీ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ సంత‌కంతో వ‌చ్చిన ఆ లేఖ‌తో ఎట్ట‌కేల‌కు జైళ్ల శాఖ రాహుల్ జైలు సంద‌ర్శ‌న‌కు అనుమ‌తించింది. అయితే ఆ లేఖ‌లో మాణిక్కం ఠాగూర్.. జైలు లోప‌లికి రాహుల్‌తో పాటు భ‌ట్టి విక్ర‌మార్క‌ను మాత్ర‌మే అనుమ‌తించాల‌ని కోరారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement