Thursday, May 26, 2022

రాఘ‌వేంద్ర‌రావుని మామ‌య్య అని సంబోధిస్తూ – శుభాకాంక్ష‌లు చెప్పిన మ‌హేశ్ బాబు

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఫ‌స్ట్ మూవీ రాజ‌కుమారుడు.ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించారు. ఇది సూప‌ర్ హిట్ట‌యింది.. కాగా రాఘవేంద్ర రావుని మ‌హేశ్ బాబు మామ‌య్య అని పిలుస్తారు..కాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు..ఇటీవల ‘పెళ్లి సందD’ ఫిల్మ్ తో యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. తన సీనియారిటీ, ఎక్స్ పీరియెన్సెస్ అన్నీ కూడా కేఆర్ఆర్ క్లాస్ రూమ్ పేరిట వివరించారు.ఈ నెల 13న దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు జీవిత విశేషాలపైన బుక్ ని లాంచ్ చేయనున్నారు. ‘లవ్ లెటర్ టు సినిమా బై కేఆర్ఆర్’ అనే టైటిల్ తో లాంచ్ చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు ట్వి్ట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు సూపర్ స్టార్ మహేశ్ బాబు.కాగా మ‌హేశ్ బాబు హీరోగా నటించిన తొలి సినిమాకి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ట్విట్టర్ వేదికగా మహేశ్ రిలీజ్ చేసిన వీడియోలో ‘మహేశ్ ..కె.రాఘవేంద్రరావును ‘మామయ్య’ అని సంబోధిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ వీడియో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement