Friday, April 26, 2024

రఫెల్‌ నాదల్‌ సంచలన నిర్ణయం!

టెన్నిస్‌ స్టార్ ప్లేయర్ రఫెల్‌ నాదల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జరిగే వింబుల్డన్‌-2021, టోక్యో ఒలింపిక్స్‌ నుంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ప్రస్తుతం తన శరీరం సహకరించడం లేదని, మరికొన్నేళ్లు కెరీర్‌ను కొనసాగించాలంటే తగినంత విశ్రాంతి అవసరమని, అందుకే ఆటకు పాక్షికంగా విరామం ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను తీసుకున్న నిర్ణయం అంత  తేలికైందేమీ కాదని, తన శరీరం సహకరిస్తున్న తీరును పరిగణనలోకి తీసుకుని నా బృందంతో చర్చించిన తర్వాతే, ఈ మేరకు నిర్ణయించుకున్నాని వెల్లడించారు. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌కు, వింబుల్డన్‌కు మధ్య రెండు వారాల సమయం మాత్రమే ఉందని గుర్తుచేశాడు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ముఖ్యంగా యూకే, జపాన్‌లో ఉన్న అభిమానుల కోసం ప్రత్యేకంగా సందేశం పంపుతున్నానని నాదల్‌ చెప్పాడు. ఒక ఆటగాడిగా తనకు ఒలింపిక్స్‌ ఎంతో కీలకమైందని తెలిపాడు.

కాగా, 35 ఏళ్ల నాదల్‌, కొద్ది రోజుల కిందట జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీస్‌లో నిష్క్రమించాడు. జొకోవిచ్‌ చేతిలో సెమీ ఫైనల్‌లో ఓటమి పాలయ్యాడు. 20 గ్రాండ్‌ స్లామ్‌లు సాధించిన నాదల్‌ 2008, 2010 వింబుల్డన్‌ ఛాంపియన్‌గా నిలిచాడు.  2008 ఒలింపిక్స్‌ పురుషుల సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement