Friday, March 29, 2024

మార్చి 11న రాధేశ్యామ్ – ట్విట్ చేసిన డైరెక్ట‌ర్

పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు డైరెక్ట‌ర్ రాధా కృష్ణ కుమార్. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ లో మార్చి 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఈ మూవీలో ప్ర‌భాస్, పూజాహెగ్డే జంట‌గా న‌టిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా ధ‌ర్డ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. మార్చి 18న ‘రాధే శ్యామ్’ విడుద‌ల‌వుతుంద‌ని ఈ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ అదే రోజున ఆర్ ఆర్ ఆర్ మూవీ వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో ‘రాధే శ్యామ్’ కొత్త రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు. సాహో త‌ర్వాత థియేట‌ర్స్‌లోకి ప్ర‌భాస్ సినిమా వ‌చ్చి రెండున్న‌రేళ్లు అవుతుంది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ‘రాధే శ్యామ్’కి సంబంధించిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ అన్నీ ప్రేక్ష‌కుల్లో మ‌రింత బ‌జ్‌ను పెంచేశాయి. ‘రాధే శ్యామ్’లో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య అనే హ‌స్త సాముద్రికా నిపుణుడి పాత్ర‌లో క‌నిపించనున్నారు. ప్రేర‌ణ అనే మ్యూజిక్ టీచ‌ర్ పాత్ర‌లో పూజా హెగ్డే క‌నిపించ‌నుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కీల‌క పాత్ర‌లో న‌టించారు. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement