Thursday, March 28, 2024

ఓటీటీలో రాధేశ్యామ్‌.. ఎప్ప‌టినుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే..

డార్లింగ్‌ ప్ర‌భాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ ఓటీటీలో రానుంది. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ అంచ‌నాల‌తో మార్చి 11న విడుద‌లైన ఈ చిత్రం మొద‌టి షో నుంచే మిక్స్‌డ్ రివ్యూల‌ను తెచ్చుకుంది. అభిమానుల నాలుగేళ్ల‌ నిరీక్ష‌ణ‌కు థియేట‌ర్‌కు వ‌చ్చిన ప్ర‌తి అభిమానిని ఈ చిత్రం తీవ్రంగా నిరాశ‌పరించింది. ప్ర‌భాస్ త‌న ఇమేజ్‌కు భిన్నంగా ఈ చిత్రంలో న‌టించాడు. ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం 212.76 కోట్ల క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. ప్ర‌భాస్‌కు జోడిగా పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ విడుద‌ల తేదీని అమేజాన్ సంస్థ అఫీషియ‌ల్‌గా విడుద‌ల చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 1 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. చిత్రం విడుద‌ల‌కు ముందు యూవీ క్రియేష‌న్స్ విడుద‌లకు నెల రోజుల త‌ర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల‌ని డీల్ కుదిరించుకున్నారు. కానీ రాధేశ్యామ్ ఆశించిన స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టలేక‌పోతుంది. దాంతో ఈ చిత్రాన్ని ప‌ది రోజుల ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు యూవీ సంస్థ‌తో అమేజాన్‌ మ‌రో డీల్‌ను కుదిరించుకుందని స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement