Thursday, April 25, 2024

ఈనెల 17నే పుష్ప .. ట్రైల‌ర్ ప‌క్కా ..

లెక్క‌ల మాష్టార్ సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం పుష్ప‌.. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తుండ‌గా , ర‌ష్మిక మంద‌న హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా , పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 6న విడుదల చేయనున్నట్టు యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 17న పుష్ప రిలీజ్ కానుంది. కాగా కొన్ని కార‌ణాల వ‌ల్ల హిందీ వ‌ర్ష‌న్ రిలీజ్ వాయిదా ప‌డనుంద‌నే టాక్ వ‌చ్చింది. డబ్బింగ్ రైట్స్ కారణంగా 17న సినిమా విడుదల కాకపోవచ్చని టాక్. అయితే ఈ వార్తలకు మేకర్స్ చెక్ పెట్టారు. హిందీ వర్షన్ కూడా ఈ నెల 17నే విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement