Thursday, April 25, 2024

పుష్ప మ‌రో రికార్డ్ – అన్ని సాంగ్స్ కి 500కోట్ల వ్యూస్

పుష్ప చిత్రం మ‌రో రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని మొత్తం పాటలన్నీ కలిపి 500 కోట్ల వ్యూస్‌ ను దక్కించుకున్నాయి. భారత దేశంలో మరే సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కు ఈ స్థాయి వ్యూస్ రాలేదు. దాంతో, పుష్ప అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టించ‌గా .. సుకుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాలోని పాటలు ఏ స్థాయిలో పాప్యులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో, బాక్సాఫీస్‌ విజయంతోనే ఈ సినిమా చరిత్ర ఆగిపోలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యంలోని మ్యాజిక్‌ ఆల్బమ్‌ కొత్త రికార్డు సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement