Thursday, April 25, 2024

పుష్ప‌కి యూ/ఏ స‌ర్టిఫికెట్ .. డిసెంబ‌ర్ 12న ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ..

పాన్ ఇండియా మూవీ పుష్ప సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కిస్తున్నాడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టిస్తుండ‌గా , స్టార్ హీరోయిన్ స‌మంత ఐటెమ్ సాంగ్ లో న‌టిస్తుంది. ఈ సినిమాలో, జగపతిబాబు, ఫాహద్ ఫాజిల్ , సునీల్ ,అనసూయ, అజయ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు.

ఈ చిత్రంలో పాట‌లతో పాటు ఫైట్స్ కూడా హైలెట్ కానున్నాయ‌ని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 17న రిలీజ్ చేయ‌నున్నారు. కాగా ఈ చిత్రానికి సెన్సార్ స‌భ్యులు యూ/ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. పుష్ప మూవీ ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 12 వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరపనున్నట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అంతేకాదు దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. మ‌రి ఈ చిత్రం ఏ రేంజ్ లో ఆక‌ట్టుకోనుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement