Friday, April 26, 2024

అన్ స్టాప‌బుల్ షో లో సంద‌డి చేయ‌నున్న పుష్ప టీం

ఓటీటీ సంస్థ ఆహాలో అన్ స్టాప‌బుల్ విత్ ఎన్బీకే షోలో హోస్ట్ గా మారారు హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఈ షోకి ఇప్ప‌టికే ప‌లువురు వ‌చ్చారు. కాగా ఈ షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంద‌డి చేయ‌నున్నాడ‌ట‌. బ‌న్నీతో పాటు పుష్ప టీం కూడా సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు నిర్వహకులు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న టెలికాస్ట్ కానుంది. మెహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి వంటి వారిని తనదైన ప్రశ్నలతో ఆటపట్టించారు బాలయ్య. ఇక ఇటీవలే ఈషోలో మాస్ మాహారాజా రవితేజ.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని సైతం సందడి చేశారు. వీరికి సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 24న టెలికాస్ట్ కానున్నట్లుగా ఇప్పటికే నిర్వహకులు ప్రకటించారు.

https://twitter.com/hashtag/UnstoppableMeetsThaggedheLe?src=hashtag_click

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement