Wednesday, April 24, 2024

పుష్ప స్పెష‌ల్ సాంగ్ లో స‌మంత .. పోస్ట‌ర్ రిలీజ్ ..

పాన్ ఇండియా మూవీ పుష్ప‌లో స్టార్ హీరోయిన్ స‌మంత ఐటెమ్ సాంగ్ లో న‌టిస్తోంది. కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్, ర‌ష్మిక జంట‌గా న‌టిస్తున్నారు. బ‌న్నీతో క‌లిసి స్టెప్పులేయ‌నుంది సామ్.. ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ అనే స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోని డిసెంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇది ‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అవుతుందని.. క్వీన్ సామ్ స్టెప్పులతో ఈ శీతాకాలం వేడెక్కబోతోందని తెలిపారు. ఈ సందర్భంగా పాటలోని సమంత స్టిల్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఓర చూపులు చూస్తూ.. ఎవరినో రమ్మన్నట్టుగా అమ్మడు పోజ్ ఇచ్చింది. ఊ అంటావా..’ సాంగ్ తో సమంత హీట్ పెంచబోతుందని పోస్టర్ లో ఆమె డ్రెస్సింగ్ చూస్తే అర్థం అవుతోంది. ఐటమ్ సాంగ్స్ ని ప్రత్యేకంగా డిజైన్ చేసే డైరెక్టర్ సుకుమార్.. ఈ గీతాన్ని మరింత స్పెషల్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి అదిరిపోయే మాస్ ట్యూన్ కంపోజ్ చేయగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారని సమాచారం. అంతేకాదు దీని కోసం గణేష్ ఆచార్యతో పాటుగా పలువురు కొరియోగ్రాఫర్స్ వర్క్ చేసారట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement