Monday, April 15, 2024

పుష్ప‌రాజ్ స్ట‌న్నింగ్ అంటోన్న మ‌హేశ్ బాబు – ర‌ష్మిక‌ని మ‌రిచాడే

ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించిన పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ చిత్రంలో పుష్ప‌రాజ్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న‌దైన‌శైలిలో జీవించాడు. కాగా ఈ చిత్రంలో బ‌న్నీకి జోడీగా ర‌ష్మిక‌మంద‌న న‌టించింది. మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. కాగా పుష్ప చిత్రాన్ని చూసిన సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు బ‌న్నీ న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు. అల్లు అర్జున్ న‌ట‌న స్ట‌న్నింగ్ అని ఒరిజిన‌ల్, సెన్సేష‌న‌ల్ అని కామెంట్ చేశారు.

పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన స్టన్నింగ్ అని పొగిడిన మహేష్ బాబు.. ఇది ఒరిజినల్, సెన్సేషనల్‌ అని కామెంట్ చేశారు. తన సినిమాలు ఎంత వాస్తవంగా, నిజాయితీగా ఉంటాయనేది సుకుమార్ మరోసారి నిరూపించారని అన్నారు. ఇకపోతే ‘నీ గురించి ఏం చెప్పాలి.. దేవి శ్రీ ప్రసాద్ నువ్వు రాక్ స్టార్‌ అంతే. పుష్ప సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్. బాయ్స్.. చాలా గర్వంగా ఉంద‌న్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా రష్మిక మందన పేరు కూడా తీయకపోవడం, ఆమె నటన గురించి మహేష్ స్పందించకపోవడంపై గ‌మ‌నార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement