Saturday, April 20, 2024

సునీల్ పాత్ర‌కి బ‌న్నీ ఫిదా

పుష్ప రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. కాగా మొద‌టి భాగం డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కిస్తుండ‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , ర‌ష్మిక మంద‌న న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ మంగ‌ళం శ్రీను అనే పాత్ర‌లో యాక్ట్ చేస్తున్నాడు. ఆయ‌న పాత్ర‌కి సంబంధించిన పోస్ట‌ర్ కూడా రిలీజ్ అయింది. సునీల్ హెయిర్ స్టైల్ .. మీసకట్టు .. లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు. ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత, చిత్తూరు యాసతో కూడిన ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనుందనే విషయం అర్థమైంది.

ఇటీవల డబ్బింగ్ చెప్పడానికి వెళ్లిన అల్లు అర్జున్ , తనకంటే ముందుగానే సునీల్ డబ్బింగ్ చెప్పేసిన సీన్స్ ను చూశాడట. సునీల్ నటన మామూలుగా లేదు .. అదరగొట్టేశాడని సుకుమార్ తో చెప్పాడట. సునీల్ పాత్ర అంత బాగా వస్తుందనీ .. అంత బాగా చేస్తాడనని తాను ఎంతమాత్రం ఊహించలేదంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడట బ‌న్నీ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement