Saturday, April 20, 2024

పునీత్ రాజ్ కుమార్ గంధ‌డ‌గుడి డాక్యుమెంట‌రీ టీజ‌ర్ .. కోట్ల‌ల్లో వ్యూస్ ..

దివంగ‌త క‌న్నడ న‌టుడు పునీత్ రాజ్ కుమార్ న‌టించిన వైల్డ్ లైఫ్ డాక్యుమెంట‌రీ టీజ‌ర్ రిలీజ్ అయింది. ఈ టీజ‌ర్ ని పునీత్ త‌ల్లి పార్వ‌త‌మ్మ రిలీజ్ చేశారు. అయితే ఈ గంధ‌డ‌గుడి డాక్యుమెంట‌రీని క‌ర్ణాట‌క‌లోని అర‌ణ్యాల‌ను ర‌క్షించు కోవ‌డం, వాటి ప్రాముఖ్య‌త గురించి ఈ డాక్యూమెంట‌రీ తెలియ‌జేస్తుంది. కాగా ఈ డాక్యూమెంట‌రీని పునీత్ స్నేహితుడు అమోఘ వ‌ర్ష నిర్మించాడు. కాగా ఈ గంధ‌డ గుడి అనే డాక్యూమెంట‌రీ వ‌చ్చే ఏడాది థీయేట‌ర్ ల‌లో విడుద‌ల కానుంది. కాపునీత్ మ‌ర‌ణం త‌ర్వాత వ‌చ్చిన మొద‌టి వీడియో కావ‌డంతో ఈ టీజ‌ర్ ఫుల్ వైరల్ అవుతుంది. జంతు , ప్ర‌కృతి ప్రేమికులు ఆనందించే విధంగా ఈ టీజ‌ర్ ఉంది. టీజ‌ర్ చివ‌రిలో పునీత్ న‌వ్వుతూ ప్ర‌కృతి ని చూసే షాట్ టీజ‌ర్ మొత్తాని కి హైలైట్ గా నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ టీజ‌ర్ ని రెండు కోట్ల మందికి పైగా వీక్షించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement